Friday, April 26, 2024
- Advertisement -

సన్ రైజర్స్ కు ఈసారి విలియమ్సన్ ఆడటం ఖాయమేనా..?

- Advertisement -

IPL లో జరిగిన మొదటి సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది.. ఆరంభం బాగానే ఉన్నా మిడిల్ ఆర్డర్ లో సరైన బ్యాట్స్ మెన్ లేకపోవడం తో మ్యాచ్ ని బెంగుళూరు కి అప్పగించినట్లయ్యింది. అయితే విలియం సన్ మిడిల్ ఆర్డర్ లో లేకపోవడం వల్లే ఈ మ్యాచ్ ఓడిపోయామని ఇప్పటికే కొన్ని వాదనలు వినిపించాయి..ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో హిట్టర్స్ ని పెట్టాలని సూచించారు.. ఓపెనర్ వార్నర్ తో పాటు సాహా లాంటి వారిని పంపి ఆ తర్వాత విలియం సన్ , బైర్ స్టో 4 ప్లేస్ లో పంపాలని , మనీష్ పాండే 5 ప్లేస్ కి పంపాలని చెప్తున్నారు..

ఇక తర్వాత ఎవరిని పంపినా పర్వాలేదు.. ఈ లోపు టాప్ 5 బ్యాట్స్ మెన్ పని పూర్తి చేస్తారని అంటున్నారు.ఇక ఐపీఎల్ లో కేన్‌ విలియమ్సన్‌ ఆటగాడిగా మంచి రికార్డు ఉండడంతో గత మ్యాచ్ లో జట్టులో తుది స్థానం తప్పకుండా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ మ్యాచ్‌లో విలియమ్సన్‌ ఆడకపోవడంపై పలు సందేహాలు రేకెత్తాయి. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఆడాలనే నిబంధన ఉండడం దీనికి కారణమై ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆర్‌సీబీతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విలియమ్సన్‌‌ ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు.

‘మ్యాచ్‌కు ముందురోజు మహ్మద్‌ నబీతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తుండగా కేన్‌ విలియమ్సన్‌‌కు కండరాలు పట్టేశాయి. దాంతో చివరి నిమిషంలో ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌కు అతను‌ దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మిచెల్‌ మార్ష్‌కు అవకాశం లభించింది. అయితే అనూహ్యంగా మార్ష్‌ కూడా గాయపడడం మాకు కష్టంగా మారింది. అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -