కోహ్లీ కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ : కృష్ణప్ప గౌతమ్

486
karnataka all rounder krishnappa gowtham says rohit sharma a better ipl captain than virat kohli
karnataka all rounder krishnappa gowtham says rohit sharma a better ipl captain than virat kohli

ఐపీఎల్ లో టీమిండియా కెఫ్టేన్ కోహ్లీ కంటే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అని స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అభిప్రయపడ్డారు. ఐపీఎల్‌లో తనదైన ఆటతో ఆకట్టుకున్న ఈ కర్ణాటక ఆల్‌రౌండర్.. తాజాగా క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు తెలిజేశారు.

క్యాష్ రిచ్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లు ధోనీ, రోహిత్, విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నించగా.. సమాధానం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇక చివరకు కోహ్లీ, రోహిత్‌లలో హిట్‌మ్యానే గొప్ప సారథని బదులిచ్చాడు. “నేనైతే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ అంటా.. ఎందుకంటే అతని సారథ్యంలో నేను ఆడా. మేం ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచాం’అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ టీ20 లీగ్‌లో ధోనీనే ఫైనెస్ట్ కెప్టెన్ అని తెలిపాడు.

ఇక కొంత మంది క్రికెటర్ల గురించి సింగిల్ వర్డ్‌లో చెప్పమనగా.. కోహ్లీ-మిస్టర్ కన్సిస్టెంట్, ధోనీ కెప్టెన్ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గౌతమ్.. 2020 సీజన్‌లో మాత్రం కింగ్స్ పంజాబ్‌కు ఆడనున్నాడు. ఇక తన 22 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 12 వికెట్లు తీసిన గౌతమ్ 144 రన్స్ చేశాడు. గత రెండు సీజన్లు రాజస్థాన్‌కు ఆడిన కృష్ణప్ప.. 2017లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సాక్షి..!

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు.. ఏం జరిగింది ?

ప్రపంచంలో బెస్ట్ యార్కర్ బౌలర్ ఎవరో చెప్పిన బుమ్రా

జట్టులో ధోనీ లేకుంటే… కోహ్లీ సక్సెస్ కాలేడు : వసీం జాఫర్

Loading...