కోహ్లీ వికెట్‌ తీసినా ముక్కున వేలు వేసుకున్న విలియమ్స్

801
Kesrick Williams takes Virat Kohli's wicket
Kesrick Williams takes Virat Kohli's wicket

తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో రెండో టీ20 మ్యాచ్ లో వెస్టిండిస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ రొటీన్ కు బిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. మాములుగా బ్యాట్స్ మన్ ను ఔట్ చేస్తే.. తన జేబులో ఉన్న నోట్ బుక్ తీసి టిక్కు పెట్టుకుని ఓ పనైపోయినట్లు బిహేవ్ చేయడం అతనికి అలవాటు.

కానీ ఈ రెండో టీ20లో భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పటికి తనదైన ‘నోట్‌బుక్ టిక్ మార్క్’ పద్ధతిలో కాకుండా కాస్త డిఫరెంట్ గా ‘నిశబ్దం’గా సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు కారణం ఉంది. అదేంటంటే హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో విలియమ్స్ బౌలింగ్ లో పరుగుల వర్షం చూపించాడు కోహ్లీ.

అంతేకాకుండా విలియమ్స్ ను అనుసరిస్తూ జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు విలియమ్స్ కి బదులిచాడు. దీంతో రెండో టీ20లో కోహ్లీ వికెట్‌ను విలియమ్స్ తీసినప్పటికీ తనదైన శైలిలో సంబరాలు చేసుకోకుండా నోటిపై వేలు వేసుకున్నాడు. ఇక ముంబైలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Loading...