Saturday, April 20, 2024
- Advertisement -

హార్ధిక్ పోరాటం వృధా…కోల్‌క‌తా కీల‌క గెలుపు

- Advertisement -

ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా సత్తాచాటింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ (80 నాటౌట్: 40 బంతుల్లో 6×4, 8×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత 232 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంత‌రం ల‌క్ష్య‌చేద‌న‌కు దిగిన ముంబ‌య్ భారీ లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమైంది. దీంతో 34 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపొందింది.

ఛేదనలో డికాక్ (0), రోహిత్ శర్మ (12), ఎవిన్ లావిస్ (15), సూర్యకుమార్ (15), కీరన్ పొలార్డ్ (20) తక్కువ స్కోరుకే ఔటైనా.. ఒంటరి పోరాటం చేసిన హార్దిక్ పాండ్య ముంబయి జట్టు పరువు నిలిపాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి గెలిచింటే..? ప్లేఆఫ్ బెర్తు ఖాయమయ్యేది.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌లో ఆండ్రీ రసెల్‌తో పాటు ఓపెనర్లు శుభమన్ గిల్ (76: 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్‌లిన్ (54: 29 బంతుల్లో 8×4, 2×6) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -