Friday, March 29, 2024
- Advertisement -

సందిగ్ధంలో కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్…..

- Advertisement -

కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ సందిగ్ధంలో పడింది. ఎన్ని సార్లు అవకాశాలు లభించినా వాటన్నింటిని రాహుల్ చేజార్చుకున్నారు. విండీస్ పర్యటనలో టీమిండియా వన్డే,టీ20, టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్విప్ చేసింది. అజింక రహానె మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. హతుమ విహారి తన సత్తా చాటి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

మయాంక్ అగర్వాల్ పర్వాలేదనిపించినా ఇప్పుడు అంతా రాహుల్ పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో అతని టెస్ట్ కెరీర్ సందిగ్దంలో పడింది.నెలరోజుల పాటు సుదీర్ఘ పర్యటనలో కేఎల్ రాహుల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ కు అవకాశం ఇవ్వాలని మాజీ కెప్టెన్ గంగూలి సూచించారు.

మరో వైపు కేఎల్ రాహుల్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశాడు.కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనగా ఉంది. అతని సామర్థ్యాన్ని ప్రశ్నించాల్సిన పనిలేదు. టెస్ట్ క్రికెట్‌కు కొత్తవాడు కాదు. ఇప్పటికే టెస్టుల్లో అనేక అవకాశాలను పొందాడు. అయినా సరే అతడు వరుసగా విఫలమవుతున్నాడు” అని అన్నాడు.

స్టుల్లో కేఎల్ రాహుల్ చివరగా సెంచరీ బాది ఏడాది అవుతుంది. గతేడాది ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్‌లు ఆడిన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.సెప్టెంబర్‌లో సపారీ జట్టు టీమిండియా పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో గనుక కేఎల్ రాహుల్ రాణిస్తే జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాడు. అలాకాని పక్షంలో రాహుల్ టెస్టుల్లో స్థానం కోల్పోవాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -