వెలుగులోకి వచ్చిన కేఎల్ రాహుల్ మరో ప్రేమాయణం….

357
KL Rahul responds to rumours linking him Akansha Ranjan Kapoor
KL Rahul responds to rumours linking him Akansha Ranjan Kapoor

టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్ లోనూ…ప్రేమ వ్యవహారాల్లోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. కాఫి విత్ కరణ్ కార్యక్రమంలో మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాహుల్ పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాహుల్‌కు బాలీవుడ్‌ భామలతో ముడిపెడుతూ తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిధి అగర్వాల్‌, అతియా శెట్టి, సోనమ్‌ బజ్వా.. లాంటి కథానాయికలతో అతడి ప్రేమాయణం గురించి వేర్వేరు సందర్భాల్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

తాజాగా మరో ప్రేమాయణ వెలుగులోకి వచ్చింది.ఆకాంక్ష అనే కొత్త అమ్మాయితో రాహుల్ ప్రేమలో ఉన్నట్లు ఓ ఫొటో వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి అలియా భట్‌కి సన్నిహితురాలైన ఆకాంక్షతో గత ఫిబ్రవరి నుంచి ఈ భారత ఓపెనర్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్త వెలుగులోకి వచ్చింది.

దీంతో మీడియా ప్రశ్నించగా తెలివిగా సమాధానాలు ఇచ్చి తప్పించుకున్నారు.‘‘నేను పత్రికలు చదవను. కాబట్టి నా గురించి ఏం రాశారో తెలియదు. వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచాలనుకుంటా. దాని గురించి ఏమీ మాట్లాడను. నా దృష్టంతా క్రికెట్‌ మీదే’’ అన్నాడు. మీరిప్పుడు ఒంటరా కాదా అని రాహుల్‌ను అడిగితే.. ‘‘ఏమో తెలియదు. ఆ సంగతే తేల్చాలి.నిర్ధారించుకున్న తర్వాత కచ్చితంగా మీకు ఫోన్ చేసి చెప్తాను’ అని రాహుల్ తెలివిగా సమాధానమిచ్చాడు.

View this post on Instagram

…n i’m so good with that 💛

A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on

Loading...