Friday, April 19, 2024
- Advertisement -

ఆర్డర్ నెం.3లో ధోనీ కంటే విరాట్ కోహ్లీనే మెరుగు : ఇర్ఫాన్ పఠాన్

- Advertisement -

టీమిండియా వన్డే టీం బ్యాటింగ్ ఆర్డర్ నెం.3పై చర్చ జరుగుతోంది. ధోనీ నెం.3లో ఇంకొంత కాలం ఆడి ఉంటే మరిన్ని రికార్డులు వచ్చేవని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇటీవలే అన్నారు. తాజాగా అతని వ్యాఖ్యాలతో మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ విభేదించాడు. నెం.3లో ప్రస్తుతం విరాట్ కోహ్లీని మించిన బ్యాట్స్ మెన్ లేడని అన్నాడు.

ధోనీతో పోలిస్తే కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్ బాగుందని కితాబిచ్చిన ఇర్ఫాన్ పఠాన్. “నెం.3లో ఆడే అవకాశం ధోనీకి ఉండేది. కానీ ఆ ప్లేస్ లో ధోనీ కంటే విరాట్ కోహ్లీ బేటర్ గా బ్యాటింగ్ చేస్తాడని నా నమ్మకం. బ్యాటింగ్ టెక్నిక్‌ పరంగానూ ధోనీ కంటే కోహ్లీనే మెరుగు. అంత మాత్రానా నేను ధోనీని కించపరచడం లేదు. అతను ఓ దిగ్గజ క్రికెటర్. అయితే ఎవరిని అభిప్రాయాలు వారికి ఉంటాయి. నెం.3లో ఎప్పటికైనా విరాట్ కోహ్లీకే నా మద్దతు’’ అని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు.

కెరీర్ మొదట్లో మిడిలార్డర్‌లో ఆడిన ధోనీ.. ఆ తర్వాత నెం.3కి మారాడు. ఆ స్థానంలో 17 మ్యాచ్‌లాడిన ఈ మాజీ కెప్టెన్ 82.75 సగటుతో 993 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకపై 2005లో 183 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన ధోనీ.. పాకిస్థాన్‌పై విశాఖపట్నంలో 148 పరుగులూ నెం.3లో ఆడి చేసినవే. కానీ.. కెప్టెన్‌గా మారిన తర్వాత ఫినిషర్ బాధ్యతని తీసుకున్న ధోనీ మ్యాచ్ గమనానికి అనుగుణంగా నెం.5 లేదా నెం.6లో ఆడుతూ వచ్చాడు. మొత్తంగా 350 మ్యాచ్‌ల్లో 50.57 సగటుతో ధోనీ 10,773 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ నెం.3లో ఇప్పటి వరకూ 187 మ్యాచ్‌లాడి 62.90 సగటుతో ఏకంగా 9,751 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉండటం గమనార్హం.

ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్‌సీబీతో : విరాట్ కోహ్లీ

టీమిండియా ఫ్యూచర్ స్టార్ ఎవరో చెప్పిన రోహిత్ శర్మ..!

ధోనీ వల్లఏ నాకు ఛాన్స్ రాలేదు : పార్థీవ్ పటేల్

భారత క్రికెటర్లు స్వార్దపూరితంగా ఆడుతారు : ఇంజిమామ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -