Friday, March 29, 2024
- Advertisement -

యార్కర్లు నేర్పించింది మలింగా కాదు: బుమ్రా

- Advertisement -

భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా యార్కర్లు వేయడంలో మంచి పట్టు సాధించాడు. ప్రత్యర్ధి టీం బ్యాట్స్ మెన్ ఏమాత్రం ఏమరపాటుగా కనిపించిన యార్కర్‌ని విసరడంలో బుమ్రా తర్వాతే ఎవరైనా..! అయితే బుమ్రా ఇలా యార్కర్లు వేయడం వెనక కారణం లసిత్ మలింగానేనని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కి వీరిద్దరు కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే.

యార్కర్లు వేయడంపై పట్టు సాధించడానికి కారణం లసిత్ మలింగ నా ? అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. బూమ్రా సమాధనమిచ్చాడు. “చాలా మంది ఇలానే మలింగా నాకు యార్కర్లు విసిరే టెక్నిక్స్ నేర్పాడని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను సొంతంగా నేర్చుకున్నాను. కాకుంటే మైదానంలో ఒత్తిడిని ఎలా అధగమించాలో మాత్రం మలింగ టిప్స్ చెప్పారని.. అలానే బౌలింగ్ చేసే టైంలో కోపం తెచ్చుకోకుండా కంట్రోల్ గా ఉండటం.. బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించడం లాంటివి మలింగా నుంచి నేర్చుకున్నట్లు” బుమ్రా చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -