ఆస్పత్రిలో కోలుకుంటున్న హార్ధిక్ పాండ్యా…సర్జరీ సక్సెస్

1751
London :Hardik Pandya undergoes successful back surgery in London
London :Hardik Pandya undergoes successful back surgery in London

టీమిండియా ఆల్‌రౌండ్ హార్ధిక్ పాండ్యాకు లండ‌న్‌లో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంత‌మైన‌ట్లు త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు. 2018 సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు.

స‌ర్జ‌రీ వ‌ల్ల హార్ధిక్ కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విషెస్ చెప్పిన వారికి హార్ధిక్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మైదానంలో దిగ‌నున్న‌ట్లు కూడా త‌న పోస్టులో చెప్పాడు. క‌నీసం అయిదు నెల‌ల పాటు హార్ధిక్ క్రికెట్‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

పాండ్యా ట్వీట్‌కు రిప్లే ఇచ్చింది బీసీసీఐ.. విష్‌ యూ ఏ స్పీడ్ రికవరీ అని కామెంట్ పెట్టింది.. కాగా, పాండ్యా క‌నీసం 5 నెల‌ల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందంటున్నారు.. భారత జట్టులో హార్ధిక్ స్థానం కీలకమైనది.. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ జట్టులో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Loading...