Friday, March 29, 2024
- Advertisement -

ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ మనోజ్ తివారీ…

- Advertisement -

ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తే బాగుంటుందని మాజీ ఆటగాల్లు సూచించిన సంగతి తెలిసిందే. అందరూ అనుకున్నట్లు గానె ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనుకున్నారు కాని ….అనూహ్యంగా సైన్యంతో కలిసి పనిచేసేందుకు బీసీసీఐ అనుమతి తీసుకుని మరీ కాశ్మీర్‌కి వెళ్లిన ధోనీ.. వెస్టిండీస్‌ పర్యటనకి దూరంగా ఉండిపోయాడు. దీంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు బ్రేక్ పడింది.

తాజాగా ధోని రిటైర్మెంట్ పై మరో క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ క్రికెటర్లందరూ ధోనిని తప్పుకోవాలని సూచించారని కాని ….కోహ్లీ మాత్రం ధోనీని వెనుకేసుకొచ్చారన్నారు. భారత్ జట్టుకి ధోనీ అవసరం ఉందని కోహ్లీ వ్యాఖ్యానించారన్నారు. సెలక్టర్లు ఇప్పటికైనా ధైర్యంగా ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. యువ క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానంకోసం ఎదురు చూస్తున్నారని…భారత్ జట్టులో చోటు ఎవరి సొంత ఆస్తి కాదు. జట్టు దేశానికి సంబంధించింది. అది గుర్తించుకుని నిర్ణయాలు తీసుకుంటె బాగుంటుందని తివారి ఘాటుగా సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -