Thursday, April 25, 2024
- Advertisement -

చెన్నై విజ‌యాల‌కు ముంబ‌య్ బ్రేక్‌…

- Advertisement -

చెన్నై వ‌రుస విజ‌యాల‌కు ముంబ‌య్ ఇండియ‌న్స్ బ్రేక్ వేసింది.బౌలర్లు లసిత్ మలింగ, హార్దిక్ పాండ్యా, బెహ్రెండార్ఫ్ ‌లు తమ బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్‌లో (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), తర్వాత బౌలింగ్‌లో (3/20) చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో రెండో విజయం సాధించింది. ఐపీఎల్‌–12లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో చెన్నైపై జయభేరి మోగించింది.

ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆదిలోనె 50 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది.సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలు రాణించడంతో జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. 43 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 8 ఫోర్లు, సిక్సర్‌తో 59 పరుగులు చేయగా, 32 బంతులు ఆడిన కృనాల్ పాండ్యా 5 ఫోర్లు, సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. చివ‌ర్లో 8 బంతులు మాత్రమే ఆడిన పాండ్యా ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేయగా, 7 బంతులు ఆడిన పొలార్డ్ 2 సిక్సర్లతో 17 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

171 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై ఆరంభంలోనె త‌డ‌బ‌డింది. వరుస ఓవర్లలో రాయుడు ఖాతా తెరువకుండానే, వాట్సన్‌ (5) సింగిల్ కే ప‌రిమిత మ‌య్యారు.కేదార్ జాదవ్(58) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.ఇటు బంతితోను, అటు బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

మలింగ, హార్దిక్ పాండ్యా, జాసన్ బెహ్రెండార్ఫ్‌లు చెలరేగి వికెట్లు తీశారు. మలింగ, పాండ్యా మూడేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, బెహ్రెండార్ఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -