చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. : మహ్మద్ షమీ

584
Mohammed Shami: Family Helped Stop Suicidal Thoughts
Mohammed Shami: Family Helped Stop Suicidal Thoughts

మానసిక ఒత్తిడి వల్ల ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ఫ్యామిలీ అండతో ఆ డిప్రేషన్ నుంచి బయటకు అచ్చినట్లు చెప్పాడు. ఇటీవలే బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణం నేపథ్యంలో మరోసారి తన కష్టాలను హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షమీ.

సుశాంత్ సింగ్ తనకు స్నేహితుడేనని చెప్పిన షమీ.. అతని మానసిక స్థితి తెలుసుంటే ధైర్యం చెప్పేవాడినన్నాడు. “మానసిక ఒత్తిడి అనేది పెద్ద సమస్య. అందుకు తగిన కౌన్సిలింగ్ కావాలి. సుశాంత్ నాకు ఫ్రెండే. సుశాంత్ మానసిక స్థితి గురించి తెలుసుంటే అతనితో మాట్లాడేవాడిని. నా లైఫ్ లో నేను పడ్డ క్షోభ గురించి చెప్పి.. ఎలా బయటకు వచ్చానో చెప్పేవాడిని. నేను డిప్రేషన్ లో ఉన్నప్పుడు కుటుంబం అండగా నిలబడింది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను ఒంటరిగా వదిలేయలేదు. అలా ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడి పోరాటం చేయాల్సిందే అనే భావనకు వచ్చా.

నేను ఎప్పుడూ ఒంటరి కాదనే భరోసా నా కుటుంబ సభ్యులు నాకిచ్చారు. అలానే కోహ్లీ, సహచర ఆటగాళ్లు కూడా అండగా నిలిచారు. మానసిక ఒత్తిడి వల్ల ఏ సమస్య వచ్చిన అది మనసులో పెట్టుకోకుండా మన మంచి కోరే వాళ్లతో పంచుకోండి. సమాధానం దొరుకుతుంది. అంతేకానీ చావు ఒక్కటే మార్గం కాదు. నా విషయంలో జట్టు నుంచి వచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేనిది. నేను నిజంగా అదృష్టవంతుడ్నే’ అని షమీ చెప్పుకొచ్చాడు.

డివిలియర్స్‌లోని సామర్థ్యం.. గేల్‌కు ఉన్న బలం.. కోహ్లీకి లేదు : గంభీర్

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ని అమ్మేశాం : శ్రీలంక మాజీ క్రీడామంత్రి

ఆ విషయంలో రోహిత్ కంటే కోహ్లీనే బేటర్ : గంభీర్

టీ20 వరల్డ్‌కప్.. ధోనీ వ్యూహమే వల్లే గెలిచింది : హార్దిక్

Loading...