Thursday, April 18, 2024
- Advertisement -

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ అరెస్ట్‌..

- Advertisement -

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌ని అమరోహ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తమ ఇంట్లోకి హసీన్ జహాన్ అక్రమంగా ప్రవేశించిందని మహ్మద్ షమీ తల్లి పోలీసులకి ఫిర్యాదు చేయగా.. సెక్షన్ 151 కింద పోలీసులు ఆమెని అరెస్టు చేశారు.
ఆ తర్వాత కాసేపటికి ఆమెను విడుదల చేశారు . ఐపీఎల్ 2018 సీజన్ ముంగిట మహ్మద్ షమీపై వరకట్నం వేధింపులు, గృహ హింస‌ కేసులు పెట్టిన హసీన్ జహాన్.. ఆదివారం రాత్రి అతడి ఇంటిలోకి ప్రవేశించి.. అక్కడ షమీ తల్లితో గొడవపడింది. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జహాన్‌‌‌ని అరెస్టు చేశారు.

హసీన్ జహాన్ ఆదివారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలోని సహస్ పూర్ గ్రామంలో తన భర్త షమీ ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి బయటికె నడవాల్సిందిగా షమీ కుటుంబసభ్యులు సూచించడంతో ఆమె తన కూతురితో ఒక గదిలోకి చొరబడి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు, ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పోలీసులు హసీన్ జహాన్ ను అదుపులోకి తీసుకున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -