Wednesday, April 24, 2024
- Advertisement -

టీ20ల్లో ధోనీ ఖాతాలో చెత్త రికార్డ్.. అదేంటంటే ?

- Advertisement -

క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. భారత క్రికెట్ లో అద్భుతమైన ఫినిషర్ గా పేరు సంపాధించుకున్నాడు. కష్టకాలంలో మ్యాచ్ లు ఉంటే మలుపు తిప్పగల హిట్టర్ అని నిరూపించుకున్నాడు. అయితే 14 ఏళ్లుగా అంతర్జాతీయ టీ20ల్లో ఓ చెత్త రికార్డ్‌ని ధోనీ కొనసాగిస్తున్నాడు.

2006లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన ధోనీ.. ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌‌’’గా నిలవలేకపోయాడు. క్రికెట్ చరిత్రలో 71కిపైగా టీ20లు ఆడినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవని ఏకైక క్రికెటర్ ధోనీ మాత్రమే. ఇక గత ఏడాది నుండి ధోనీ టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 98 టీ20 మ్యాచ్‌లాడిన ధోనీ.. 37.6 సగటుతో 1,617 పరుగులు చేశాడు.

ఇందులో 116 ఫోర్లు, 52 సిక్సర్లు ఉండగా.. కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే ధోనీ నమోదు చేశాడు. వన్డే, టీ20ల్లో ఎక్కువగా స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసే ధోనీకి సాధారణంగా తక్కువ బంతులు ఆడే అవకాశం వస్తుంటుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‍లాడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ధోనీ తర్వాత దినేశ్ రామ్‌దిన్ (71 మ్యాచ్‌లు), అస్గర్ అఫ్గాన్ (69), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (61), దినేశ్ చండిమాల్ (54) టాప్-5లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -