Saturday, April 20, 2024
- Advertisement -

ధోనీ దెబ్బ‌కు గుండెలు ప‌గిలేలా ఏడ్చిన బంగ్లా అభిమానులు

- Advertisement -

బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ ఆటతీరు కంటే వ్యవహారశైలితోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారనే సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీలంకపై గెలిచి నాగినీ డ్యాన్స్‌లతో సంబరాలు చేసుకోవడం, డ్రెస్సింగ్ రూంలో గ్లాస్ డోర్ పగలగొట్టడం ఇవన్నీ ఓ మచ్చుతునక మాత్రమే. బంగ్లా ఫ్యాన్స్ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. గతంలో భారత్‌తో తలపడిన సందర్భాల్లోనూ బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. మరి దానికి భారత్ ఎలా బదులిచ్చిందో మరోసారి గుర్తు చేసుకుందాం.

రెండేళ్ల క్రితం అంటే 2016లో బంగ్లాదేశ్ ఆసియా కప్‌కి ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లా జట్టు సెమీఫైనల్లో పాక్‌ను ఓడించి ఫైనల్లో భారత్‌తో పోరుకి సమాయత్తమైంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లా అభిమానులు శ్రుతి మించి వ్యవహరించారు. బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ నరికిన ధోనీ తలను చేత్తో పట్టుకున్నట్టుగా ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటో చూసి ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. మార్చి 6న జరిగిన ఫైనల్లో ధోనీ సేన బంగ్లాను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

తర్వాత కేవలం ఒక్క రోజు గ్యాప్‌తోనే భారత గడ్డ మీద టీ20 వరల్డ్ కప్ ఆరంభమైంది. మార్చి 23న బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ధోనీ సేన ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు.

హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. దీంతో బంగ్లా అభిమానులు ముందుగానే సంబరాలు చేసుకున్నారు. ఈ దశలో విన్నింగ్ షాట్‌గా సిక్స్ బాదడం కోసం యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి.

ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు సలహా ఇచ్చారు. ధోనీ తన బుర్రకు పదును పెట్టి కట్టుదిట్టంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన చివరి బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. కానీ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే పసిగట్టిన ధోనీ బంతిని అందుకోవడమే ఆలస్యం.. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడంతో ఆఖరి బంతికి తమ జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో.. బంగ్లా ఫ్యాన్స్ షాకయ్యారు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్స్ బాదిన దినేశ్ కార్తీక్ కూడా మరోసారి బంగ్లా ఫ్యాన్స్‌‌కు టీమిండియా పవరేంటో రుచి చూపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -