మోదీ టీంలోకి ధోని….కేంద్ర మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

236
MS Dhoni may enter politics after retiring from cricket : Says former Union Minister Sanjay Paswan
MS Dhoni may enter politics after retiring from cricket : Says former Union Minister Sanjay Paswan

టీమిండియా వికెట్ కీప‌ర్, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని రెండో ఇన్నీంగ్స్‌ను మొద‌లు పెట్ట‌నున్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా పోరు ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపు ధోని రిటైర్మెంట్ పైనె. డిసెంబర్‌లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ధోనీకి బీజేపీ గాలం వేస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ధోని రిటైర్మెంట్‌ అనంతరం మోదీ టీంలో చేరుతార‌ని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతున్నాయి.

రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ రిటైర్మెంట్‌పైనే స్పష్టమైన ప్రకటన చేయని ధోనీ.. పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తాడని భావించడం తొందరపాటే అవుతుందన్నది కొంతమంది వాదిస్తున్నారు. ఇదే జ‌రిగితె త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది.

Loading...