Thursday, March 28, 2024
- Advertisement -

ప్ర‌పంచ రికార్డుకు అడుగుదూరంలో ధోని…

- Advertisement -

భారత్ వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని కీపింగ్‌లో ప్ర‌పంచ రికార్డును బ్రేక్ చేసేందుకు అడుగు దూరంలో ఉన్నారు. సుదీర్ఘంగా టీమిండియా జ‌ట్టుకు ఆడుతున్న ధోని ఇప్ప‌టికే అనేక రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి ధోని 594 మ్యాచ్‌ల‌కి ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇంకో రెండు మ్యాచ్‌ల‌కు కీప‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు వికెట్ కీప‌ర్‌గా అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల‌లో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్క్ బౌచ‌ర్ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత మహేంద్రసింగ్ ధోని (594) ఉన్నాడు. త‌రువాత స్థానాల్లో సంగక్కర 499 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. 485 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సొంత‌గ‌డ్డ‌పై ఈ నెల 24 నుంచి భారత్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్న నేపథ్యంలో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీప‌ర్ల జాబితో ధోనీ నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని అధిరోహిస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -