Saturday, April 20, 2024
- Advertisement -

ధోనీ రీఎంట్రీపై స్పందించిన రోహిత్ శర్మ..!

- Advertisement -

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దూరమయ్యాడు. దాదాపు 10 నెలలుగా ఎలాంటి మ్యాచ్‍లు అడలేదు. దాంతో అతని కెరీర్ పై రకరకల వార్తలు వస్తున్నాయి. కొందరు అతని కెరీర్ ఇక ముగిసిపోయిందనే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడి ఫాంలోకి వస్తే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని ధోనీ ఆశించాడు.

కానీ కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడింది. దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. అయితే సురేశ్ రైనాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా.. ధోనీ భవితవ్యం గురించి చర్చ వచ్చింది. రైనా మాట్లాడుతూ.. “ధోనీతో ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ట్రైనింగ్ సెషన్స్‌‌లో కలిసి బ్యాటింగ్ చేశాను. చాలా చక్కగా బంతిని అతను హిట్ చేశాడు. కానీ.. అతని మనసులో ఏముందో..? కేవలం అతనికి మాత్రమే తెలుసు.

అతని వ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్తే అప్పుడు మనకీ ఓ క్లారిటీ వస్తుంది’’ అని వెల్లడించాడు. ధోనీ గురించి సురేశ్ రైనా చెప్పిన విషయాల్ని విన్న రోహిత్ శర్మ.. తన అభిప్రాయాన్ని చెప్పాడు. “ధోనీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే.. అతను తప్పకుండా టీమిండియాకి ఆడి తీరాలి. అతను ఆడగలడని నాకు తెలుసు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. అప్పటిలోపు టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ధోనీ, రైనా ఆశిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -