చెన్నై సూపర్ కింగ్స్ లో హిట్టర్‌ని సిద్దం చేస్తున్న ధోనీ..!

906
Ms Dhoni Pulled Piyush Chawla's Legs During Csk's Training Session
Ms Dhoni Pulled Piyush Chawla's Legs During Csk's Training Session

కెఫ్టెన్ గా జట్టులోని ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శన రాబట్టడంలో ధోనీ మంచి సిద్దహస్తుడు. ఎవరిని ఏ స్థానంలో బ్యాటింగ్ కి పంపాలి ? ఎవరితో ఏ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ చేయించాలి ? ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి ? అనేదానిపై ధోనీకి ఫుల్ క్లారిటీ ఉంది. ఇక ఐపీఎల్ లో ధోనీ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కవు.

చైన్నై సూపర్ కింగ్స్ కి కెఫ్టెన్ గా ఉన్న ధోనీ.. టీంలో ఓ ఫించ్ హిట్టర్‌ని తయారు చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏ స్థానంలో బ్యాటింగ్ కు పంపినా ప్రతి బంతినీ హిట్టింగ్ చేయడమే అతని పని. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో సునీల్ నరైన్‌ ఆ పాత్రని చక్కగా పోషిస్తుండగా.. చెన్నై జట్టులో మాత్రం అలాంటి హిట్టర్ ఎవరూ లేరు. దాంతో.. ధోనీ.. పీయూస్ చావ్లాకి ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆ బాధ్యతని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే మార్చి 29 ఐపీఎల్ మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వాయిదాకు ముందు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ, సురేశ్ రైనా, పీయూస్ చావ్లా తదితరులు ఓ రెండు వారాల పాటు ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేశారు. ఆ టైంలో ధోనీ.. చావ్లాకి ’బంతిని డిఫెన్స్ చేయకుండా.. ప్రతి బంతినీ సిక్సర్ బాదాలి’ అనే టాస్క్ ఇచ్చాడు. దాంతో.. నెట్స్‌లో చావ్లా హిట్టింగ్ చేసిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తాజాగా అభిమానులతో పంచుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం వేలంలో రూ. 6.75 కోట్లతో చావ్లాని చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

సచిన్ కోసం స్కూల్ డుమ్మా.. : రైనాకు షాక్ ఇచ్చిన భజ్జీ..!

Loading...