ధోనీ రిటైర్మెంట్‌ పై స్పందించిన భార్య సాక్షి సింగ్ …

470
MS Dhoni Retirement Rumours :its called rumours, says dhonis wife sakshi sing
MS Dhoni Retirement Rumours :its called rumours, says dhonis wife sakshi sing

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్ కాబోతున్నాడని ఈరోజు ఏడు గంటలకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకటన చేయనున్నారని ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ బీజేపీ పార్టీలో చేరుతాడని నరేంద్రమోదీ టీమ్‌లో పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తాడని రూమర్లు వినిపించాయి. ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ సీఎం అభ్యర్థిగా ధోనీని బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ధోనీ ఇవాళ(12 సెప్టెంబర్ 2019) రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు గట్టిగా ప్రచారం అయ్యాయి.

వార్తలను బీసీసీఐ ఖండించింది. ఈ వార్తలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ధోనీ రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చిఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. తాజగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధోని భార్య సాక్షి సింగ్ క్లారిటీ ఇచ్చారు.ట్టర్ వేదికగా “అవన్నీ వట్టి పుకార్లే” అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ అనేది వట్టి మాటలే అని క్లారిటీ ఇచ్చేసినట్లు అయ్యింది. మరోవైపు సౌతాఫ్రికా జరిగే టూర్‌కు ధోనీకి చోటు లభించకపోవడంతో అందరూ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారని భావిస్తున్నారు.

Loading...