Thursday, March 28, 2024
- Advertisement -

సాయంత్రం 7 గంటలకు ధోని సంచలన ప్రకటన…?

- Advertisement -

ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్మెంట్ పై అనేక రకాల ఊహాగానాలు హల్ చల్ చేశాయి. రిటైర్మెంట్ కు ఇదే సమయం అని మాజీ క్రికెటర్లు సైతం సూచించారు. అయితే ఇప్పటి వరకు ధోని తన రిటైర్మెంట్ పై ప్రకటించలేదు. కాని కోహ్లీ చేసిన ట్వీట్ చూస్తె ధోని రిటైర్మెంట్ ను ప్రటించేందుకు సిద్దమయ్యారనె వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకి మీడియాతో ముఖంగా ధోని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ధోనీతో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాజాగా విరాట్ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. దీంతో.. ధోనీ రిటైర్మెంట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.2016, టీ20 ప్రపంచకప్‌‌లో ఆస్ట్రేలియా‌తో ఢీకొట్టిన భారత్ జట్టు.. 161 పరుగుల ఛేదనలో 14 ఓవర్లు ముగిసే సమయానికి 94/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. విరాట్ కోహ్లీతో కలిసి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికే కీలక వికెట్లు చేజారడంతో బంతిని ఏమాత్రం గాల్లోకి లేపకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జంట.. సింగిల్స్, డబుల్స్‌తోనే భారత్‌ని విజయతీరాలకి చేర్చింది.

టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధోనీ ఇప్పటికే తన నిర్ణయం ప్రకటించేశాడని సమాచారం. 2019సెప్టెంబర్ 12న అధికారికంగా ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ధోనీ రిటైర్మెంట్ ఇవ్వొద్దని ఆన్‌లైన్ వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.టీమిండియాలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ పూర్తిగా నిలదొక్కుకోలేదు. ఇటువంటి క్రమంలో జట్టుకు ధోనీ అనుభవం ఎంతగానో అవసరమని అభిమానులు కోరుతున్నారు.

https://twitter.com/Tony300rs/status/1172067209427865601

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -