Friday, March 29, 2024
- Advertisement -

అలా చేస్తే ధోనిని అవ‌మానించ‌డ‌మే…మాజీ క్రికెట‌ర్ సేహ్వాగ్‌

- Advertisement -

మ‌హేంద్ర‌సింగ్ ధోని రిటైర్మెంట్‌పై బీసీసీఐ తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. రిటైర్మెంట్ ఇవ్వాల‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లురాగా బీసీసీఐ కూడా ఆదిశ‌గా ఆలోచ‌న చేస్తోంది. ధోని స్థానంలో పంత్‌ను ఆడించాల‌ని సూచ‌న‌ల‌ను వ‌స్తున్నాయి. అయితే ధోని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. వెస్టిండీస్ పర్యటనకి ఆదివారం సెలక్టర్లు ప్రకటించనున్న భారత్ జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్‌లో ధోనీ పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. అతనిపై వేటు వేస్తారా..? లేక జట్టులో చోటిస్తారా..? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. తాజాగా ధోని రిటైర్మెంట్‌పై మాజీ క్రికెట‌ర్ సేహ్వాగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్‌ని జట్టు నుంచి తప్పించే సమయంలో అతనితో మాట్లాడాల్సిందిగా సెలక్షన్ కమిటీలో సభ్యుడైన విక్రమ్ రాథోర్‌కి తాను చెప్పానని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వెల్ల‌డించారు. అయితే సేహ్వాగ్ మాత్రం టీమ్‌ నుంచి తప్పించే వరకూ త‌న‌తో ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని తెలిపారు. దీంతో.. ఆ తప్పునకి తాను బాధ్యత వహిస్తున్నట్లు సందీప్ పాటిల్ అంగీకరించాడు. దీంతో.. కనీసం ధోనీ విషయంలోనైనా సెలక్టర్లు కాస్త హుందాగా వ్యవహరించాలని సెహ్వాగ్ సూచించాడు. అలా కాకుండా ధోనిని త‌ప్పించి తీరిగ్గా అత‌న‌కి చెప్తే అవ‌మానించ‌డ‌మేన‌న్నారు.

నా విష‌యంలో జ‌రిగిన త‌ప్పు ధోని విష‌యంలో జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ధోనిని జ‌ట్టునుంచి త‌ప్పించాలంటే ముందుగా అత‌నితో మాట్లాడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. జట్టు నుంచి ఆటగాడ్ని తప్పించిన తర్వాత ఇక అతనితో మాట్లాడటానికి సెలక్టర్ల వద్ద ఏముంటుంది..? ఒకవేళ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోనీ విషయంలో ఇదే పంథాని అవలంబిస్తే..? ధోనీ మాత్రం ఏం చెప్పగలడంటూ సేహ్వాగ్ త‌న మ‌న‌సులోని అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -