Friday, April 19, 2024
- Advertisement -

విండీస్ టూర్‌లో ధోని ఉంటాడు….కాని…?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత టీమిండియా విండీస్ టూర్‌కు సిద్ద‌మ‌వుతోంది. అయితే విండీస్ టూర్‌కు వెల్లే జ‌ట్టులో ధోని ఉంటారా లేరా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో అనుకున్నంత‌లో ధోని బ్యాటింగ్‌లో రాణించ‌లేదు. పేవ‌ల బ్యాటింగ్‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని ఇప్ప‌టికే ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌మ అభిప్రాయాన్ని వెలుబుచ్చిన సంగ‌తి తెలిసిందే. ధోనీ ఏం నిర్ణయం తీసుకుంటాడు? అందరూ అనుకున్నట్టుగానే రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా? అన్నదే హాట్‌టాపిక్‌గా మారింది

బీసీసీఐ కూడా ధోని కొన‌సాగింపుపై అయిస్టంగానె ఉంది.ధోనీ టీమిండియా వెంట వెస్టిండీస్‌ వెళతాడా? లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లబోయే జట్టును ఈ నెల 19న బీసీసీఐ ప్రకటించబోతోంది. ఈ జ‌ట్టులో ధోని ఉంటారా లేదా అన్న దానిపై బీసీసీఐ అధికారి ఒక‌రు క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్‌ చాయిస్‌ వికెట్‌ కీపర్‌గా జట్టులో ధోనీ ఉండరు. ఆయన వెస్టిండీస్‌ వెళ్లినా.. జట్టులోని 15 మంది సభ్యుల్లో ఒకడిగా వెళుతారు. కానీ, మైదానంలో ఆడే 11 మందిలో ఉండరు. ఫస్ట్‌ చాయిస్‌ కీపర్‌గా ధోనీ స్థానాన్ని రిషబ్‌ పంత్‌ భర్తీ చేయనున్నార‌ని …పంత్‌ కుదురుకునేవరకు ధోనీ జట్టులో ఉండి.. అతనికి మార్గదర్శిగా వ్యవహరిస్తార‌ని క్లారిటీ ఇచ్చారు.

అయితే ధోని అనుభ‌దం జ‌ట్టుకు ఎంతో అవ‌స‌రం ఉంద‌న్నారు. ధోనిని ఇప్పుడే జ‌ట్టునుంచి దూరం చేయ‌డంలేద‌న్నారు.ఈ లెక్కన ధోనీ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లినా.. మైదానంలో ఆడే తుది జట్టులో ఉండబోడని బీసీసీఐ వర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నా …. మైదానంలో కోహ్లికి మార్గదర్శిగా వ్యవహరిస్తున్నసంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -