ధోనిపై ప్ర‌శంస‌లు కురిపించిన టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి

410
MS Dhono key role in ICC World Cup 2019 : Says Coach Ravisastri
MS Dhono key role in ICC World Cup 2019 : Says Coach Ravisastri

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలతో ముంచెత్తారు కోచ్ ర‌విశాస్త్రి. వన్డే ఫార్మాట్‌లో ధోనిని మించిన ఆటగాడే లేడని కొనియాడాడు. మెగాటోర్నీ వరల్డ్‌కప్‌ కోసం ఇంగ్లండ్ బయల్దేరడానికి ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో కలిసి కోచ్ రవిశాస్త్రి మీడియాతో ముచ్చటించాడు.ముఖ్యంగా క్లిష్టపరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే క్షణాల్లో అతడి అనుభవం చాలా ఉపయోగపడుతుంద‌న్నారు.

వరల్డ్‌కప్‌ లాంటి వేదికల్లో ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడాలి. మా సామ‌ర్థ్యం మేరకు రాణిస్తే కప్పు మన సొంతమవుతుంది. ఈ టోర్నీలో గట్టిపోటీ ఉంటుంద‌న్నారు. ప్లేయర్లకు సహకారం అందించడంలో, విలువైన సూచనలివ్వడంలో ధోనీ ముందుంటాడని వివరించాడు. వికెట్ కీపర్లలో అతని కంటే ఉత్తమమైన వారు ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో లేరని వ్యాఖ్యానించాడు. ‘వరల్డ్ కప్ జట్టులో ఎంఎస్ ధోనీ పాత్ర కీలకమైంది. విరాట్ కోహ్లీతెో పాటు, ప్లేయర్లతో అతని చక్కటి సంబంధాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. మే30 నుంచి వరల్డ్ కప్ మొదలుకానుండగా భారత్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది

Loading...