బాడ్మింటన్ స్టార్ కి బహుమతి ఇచ్చిన నాగార్జున

539
Nagarjuna Presented BMW To Badminton World Champion PV Sindhu
Nagarjuna Presented BMW To Badminton World Champion PV Sindhu

హైదరాబాద్ కి చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రపంచ చాంపియన్షిప్ చేంజ్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రమే కాకుండా పలు సెలబ్రిటీలు కూడా ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా బాడ్మింటన్ ప్రపంచ కప్ విజేతగా చరిత్ర సృష్టించిన పి.వి.సింధు కి కొందరు ప్రముఖులు బహుమతులు కూడా ఇస్తున్నారు. మాజీ క్రికెటర్ మరియు హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన చాముండేశ్వరి నాథ్ పి.వి.సింధు కి ఒక ఖరీదైన బీఎండబ్ల్యూ కారు బహుమానంగా ఇచ్చారు.

తాజాగా శనివారం జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున కూడా ఒక బీఎండబ్ల్యూ కారు పీవీ సింధు కి బహుకరించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పీవీ సింధు మరియు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి కూడా నిన్న వచ్చి బిగ్ బాస్ ఇంటి సభ్యులు పలకరించడం జరిగింది.

మరోవైపు 2016లో ఒలంపిక్స్ లో రజత పతకం గెలుచుకున్నప్పుడు కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పి.వి.సింధు కి ఒక ఖరీదైన కారుని బహుకరించిన సంగతి తెలిసిందే.

Loading...