Friday, March 29, 2024
- Advertisement -

రెండో వన్డేలో గెలిచిన న్యూజిలాండ్‌ కి జరిమానా..!

- Advertisement -

ఆక్లాండ్ వేదికగా శనివారం భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌కి స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద ఇప్పుడూ జరిమానా పడింది. మ్యాచ్‌లో కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే మూడు ఓవర్లు తక్కువగా వేసిన న్యూజిలాండ్ టీమ్‌కి మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు.

తొలి వన్డేలో 4 ఓవర్లు తక్కువగా వేసిన భారత్ జట్టుకి 80 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడిన విషయం తెలిసిందే. మ్యాచ్ లో టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా.. ఛేదనలో టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులకే కుప్పకూలిపోయింది. అయితే.. ఆఖర్లో రవీంద్ర జడేజా (55), నవదీప్ సైనీ (45) దూకుడుగా ఆడటంతో.. ఒత్తిడికి గురైన న్యూజిలాండ్ టీమ్.. మ్యాచ్ సమయాన్ని వేస్ట్ చేసింది. ప్రధానంగా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తరహాలో సైనీ హిట్టింగ్ చేయడంతో కివీస్ టీమ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ పదే పదే బౌలర్లతో చర్చలు జరపడం కనిపించింది.

దీంతో.. వేయాల్సిన ఓవర్ల కంటే మూడు ఓవర్లని న్యూజిలాండ్ తక్కువగా వేసింది. కివీస్ గడ్డపై ఇటీవల భారత్ జట్టు కూడా ఛేదన సమయంలో బౌలింగ్ చేసే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద జరిమానాకి గురైంది. నాలుగో టీ20లో రెండు ఓవర్లు తక్కువగా వేసి 40 శాతం జరిమానా చెల్లించిన టీమిండియా.. ఐదో టీ20లో ఒక ఓవర్ తక్కువగా వేసి 20 శాతం, తొలి వన్డేలో 4 ఓవర్లు తక్కువగా వేసి 80 శాతం మ్యాచ్ ఫీజుని కోల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -