Wednesday, April 24, 2024
- Advertisement -

శ్రీనివాస గౌడ రికార్డ్ బ్రేక్ చేసిన నిశాంత్ శెట్టి..!

- Advertisement -

కర్ణాటకలో జరుగుతున్న కంబాళ ఇప్పుడు మరో రికార్డు… గత వారం శ్రీనివాస గౌడ 142.5మీ దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పూర్తి చేసి భారత్ ఉసేన్ బోల్ట్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా గౌడ రికార్డ్‌ని మరో కంబాళ జాకీ నిశాంత్ శెట్టి బ్రేక్ చేశాడు.

నిశాంత్ 143మీ దూరాన్ని కేవలం 13.61 సెకన్లలోనే పూర్తి చేసినట్లు కంబాళ పోటీ నిర్వాహకులు ప్రకటించారు. జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ 100మీ పరుగుని 9.58 సెకన్లలో పూర్తి చేసిన రికార్డ్ ఇప్పటి వరకూ నెం.1 స్థానంలో ఉంది. కానీ.. గత వారం కంబాళ పోటీలో శ్రీనివాస గౌడ వేగాన్ని లెక్కించిన ఓ నెటిజన్ అతను 100మీ పరుగుని 9.55 సెకన్లలో పూర్తి చేసినట్లు తేల్చాడు.

దీంతో.. అతను చేసిన ట్వీట్‌కి సెలబ్రిటీలు రెస్పాండ్‌ అవడంతో అది వైరల్‌గా మారిపోయింది. దీంతో.. ఏకంగా కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు స్పందించి.. శ్రీనివాస గౌడకి ఒకసారి ట్రయల్స్ నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సాయ్ అధికారుల్ని ఆదేశించాడు. శ్రీనివాస గౌడ వేగం గురించి ఒకవైపు చర్చ జరుగుతుండగా.. తాజాగా నిశాంత్ శెట్టి ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు.

100మీ పరుగుని గౌడ కంటే మూడు సెకన్ల ముందే అంటే.. 9.52 సెకన్లలోనే నిశాంత్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. అసలు కంబాళ పోటీలో వేగం లెక్కింపు కోసం వాడుతున్న సాంకేతిక యంత్రాలపై అనుమానాలు నెలకొన్నాయి. నిజానికి ట్రాక్‌పై పరుగెత్తడంతో పోలిస్తే.. కంబాళ పోటీలో పరుగెత్తడం కాస్త సులువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -