Wednesday, April 24, 2024
- Advertisement -

దినే ష్‌ కార్తిక్‌పై నెటిజ‌న్ల సెటైర్లు…భార‌త్ ఓట‌మికి అదే కార‌ణ‌మా..?

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఆఖ‌రి టీ20లో భార‌త్ పోరాడి ఓడిది.దీంతో కీవీస్ 2-1తో సిరీస్‌ను కౌవ‌సం చేసుకుంది. అయితే దినేష్ కార్తిక్‌పై సీనియ‌ర్లు, నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం హిట్టర్‌గా విఫలమయ్యాడు. భారత విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. క్రీజులో దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యాలున్నారు. అప్పటికే దాటిగా ఆడుతూ ఈ ఇద్దరు క్రీజులో కుదుర్కోవడంతో భారత్‌ విజయం కాయమని అందరూ భావించారు. కానీ సౌతీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత గెలుపును అడ్డుకున్నాడు.

ఆఖరి టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చిన్న తప్పిదం కారణంగా భారత్‌కి మ్యాచ్‌ దూరమైందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌తో పాటు మ‌రో మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ అభిప్రాయపడ్డారు.చివ‌రి ఓవ‌ర్ల‌లో తొలి బంతికి డబుల్ తీసిన కార్తీక్.. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్ని వృథా చేసి.. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఐదో బంతికి మళ్లీ కృనాల్ సింగిల్ తీసివ్వగా.. ఆ తర్వాత వైడ్, ఆఖరి బంతిని కార్తీక్ సిక్స్‌గా మలిచాడు. కానీ అప్ప‌టికే జ‌రిగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. మూడో బంతికే సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. దినేశ్ కార్తీక్ నిరాకరించాడు. ఇదే మ్యాచ్‌లో కీలక మలుపుగా చెప్పవచ్చు.

అప్పటికే క్రీజులో కుదురుకున్న కృనాల్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మంచి ఊపుమీద కనిపించాడు. కానీ.. అతివిశ్వాసానికి వెళ్లిన కార్తీక్.. మ్యాచ్‌‌ను దూరం చేశాడంటూ అటు నెట‌జ‌న్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. కృనాల్‌ సింగిల్‌కు ప్రయత్నించినప్పుడు కార్తీక్‌ తిరస్కరించడాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. సింగిల్ తీసుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని నెట‌జ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.‘కార్తీక్‌.. నువ్వు ధోని అనుకుంటున్నావా?’ అని ఒకరు.. ‘ఎప్పుడూ స్వప్రయోజనం కోసమే కార్తీక్‌ ఆడుతాడు.. ఇదే ధోనికి కార్తీక్‌ ఉన్న తేడా’ అని మరొకరు ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. ఓడిన‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం…గెలిచిన‌పుడు పొగ‌డ్త‌లు కురిపించ‌డం అభిమానుల‌కు ఆలవాటేగా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -