Wednesday, April 24, 2024
- Advertisement -

కోహ్లీ టీం బాట‌లోనే మిథాలి టీమ్‌..

- Advertisement -

మౌంట్‌ మాంగనీ వేదికగా భారత్ – న్యూజిలాండ్‌ మహిళల మధ్య జరిగిన రెండో వ‌న్డేలో కీవీస్‌ను భార‌త్ చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందాన (90), కెప్టెన్ మిథాలీ రాజ్ (63) పరుగులతో అజేయంగా నిలిచారు. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా వ‌రుస‌గా రెండు వ‌న్డేలు గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెనర్ జెమిమా (0) డకౌట్ అయింది. మరోకొద్ది సేపటికే శర్మ (8) కూడా పెవిలియన్ చేరింది. 15 ఓపరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మందాన, మిథాలీలు ఆదుకున్నారు. ఈ జోడి మూడో వికెట్‌కు అజేయంగా 151 పరుగులు జోడించారు. అంతకుముందు టీమిండియా బౌలర్లు రాణించడంతో కివీస్‌ 161 పరుగులకే ఆలౌట్ అయింది.

తొలి వన్డేలో సెంచరీ చేసిన స్మృతి ఈ మ్యాచ్‌లోనూ 90 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. అటు మిథాలీ 63 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చివరికి ఓ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి మూడు వికెట్లు తీయగా.. ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ టీమ్‌లో సాటెర్త్‌వేట్ మాత్రమే 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మ‌రో వైపు కోహ్లీసేన‌కూడా న్యూజిలాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఐదు వ‌న్డేలో భాగంగా వ‌రుస‌గా మూడు వ‌న్డేలు గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -