కోహ్లీ, ధోనీ ఇద్దరిలో శిఖర్ ధావన్ ఓటు ఎవరికంటే ?

686
Opener Shikhar Dhawan Picks The Better Captain Between Virat Kohli And Ms Dhoni
Opener Shikhar Dhawan Picks The Better Captain Between Virat Kohli And Ms Dhoni

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మ్యాచ్ లో నిలదొక్కుకుని మంచి పరుగులు చేయగల సత్తా ధావన్ కు ఉంది. అయితే ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో శిఖర్ ధావన్ మాట్లాడుతుండగా.. కెప్టెన్ల గురించి చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలో ధోనీ, విరాట్ కోహ్లీ పేర్లని ప్రస్తావించిన శిఖర్ ధావన్.. ఆఖరిగా ధోనీకే ఓటేశాడు.

ఇక కెరీర్ లో ఎదుర్కొన్న టఫ్ బౌలర్ ఎవరు ? అనే ప్రశ్నకు ధావన్ జవాబు ఇచ్చాడు. “నా కెరీర్ లో నేను చాలా మ్యాచ్ లు ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడాను. కానీ.. బెస్ట్ కెప్టెన్ అంటే మాత్రం ధోనీనే. ఇక నేను ఎదుర్కున్న టఫ్ బౌలర్ ఎవరంటే.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్’’ అని శిఖర్ ధావన్ వెల్లడించాడు. వాస్తవానికి శిఖర్ ధావన్ ఐదుగురి కెప్టెన్సీలో ఆడాడు. గత ఐదేళ్లుగా కోహ్లీ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. అయినప్పటికీ ధోనీ పేరునే అతను చెప్పడం విశేషం.

2010లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్.. ఇప్పటివరకు 34 టెస్టులు, 136 వన్డేలు, 60 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వెనుదిరిగిన ధావన్.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా కీలక సిరీస్‌లకి కూడా దూరమయ్యాడు. దాంతో అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ టీ20, వన్డేల్లో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోగా.. రోహిత్ శర్మ టెస్టుల్లో అతని స్థానాన్ని ఓపెనర్‌గా భర్తీ చేసేశాడు.

Loading...