Friday, March 29, 2024
- Advertisement -

ఇండియా అల్లుడికి షాక్ …శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం జట్టును ను ప్రకటించిన పాకిస్థాన్…

- Advertisement -

త్వరలో శ్రీలంక పాక్ లో పర్యటించనుంది. లంక సీనియర్ ఆటగాళ్లు ఎవరూ పాక్ లో పర్యటించమని తేల్చి చెప్పడంతో ఆ దేశ బోర్డు యువ ఆటగాళ్లను పంపిస్తోంది. ప్రపంచకప్ లో పేవల ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్న పాక్ కోచ్ ఇతర ఆటగాళ్లపై వేటు వేసి…కొత్క కోచ్ గా మిస్బాను నియమించింది. తాజాగా లంకతో వన్డే సిరీస్ ఆడే 16 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. సీనియర్లను పక్కన బెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించారు.

పాక్‌ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొత్త పెళ్లికొడుకు, హరియాణా అల్లుడు హసన్‌ అలీని జట్టులోకి తీసుకోలేదు.హరియాణా యువతితో హసన్‌ అలీ వివాహం గత నెలలో దుబాయ్‌ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అతడి గాయంపై స్పష్టతలేదని అందుకే విశ్రాంతి కోచ్ మిస్బావుల్‌ ఇచ్చామని తెలిపాడు.

భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాక్‌ పర్యటనకు ఆసక్తి చూపకపోవడంతో.. జూనియర్‌ ఆటగ్లాను పంపించాలనే ఆలోచనలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఉంది. ఈ నేపథ్యంలో మిస్బావుల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదన్నారు. అన్ని విభాగాల్లో పాక్ జట్టు పటిష్టంగా ఉందన్నారు.

పాక్‌ జట్టు:

సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), బాబర్‌ అజమ్‌(వైస్‌ కెప్టెన్‌), అబిద్‌ అలీ, ఆసిఫ్‌ ఆలీ, పఖర్‌ జామన్‌, హారీస్‌ సోహైల్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, ఇమాముల్‌ హక్‌, అమిర్‌, మహమ్మద్‌ హస్నైన్‌, నవాజ్‌, రియాజ్‌, షాదాబా ఖాన్‌, ఉస్మాన్‌ షిన్వారీ, వాహబ్‌ రియాజ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -