రోహిత్ ఆట చూస్తే నాకు సచిన్ గుర్తొచ్చాడు : షోయబ్ అక్తర్

734
pakistan former pacer shoaib akhtar praises rohit sharma
pakistan former pacer shoaib akhtar praises rohit sharma

బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో టీమిండియా సాధిచిన విజయంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా అగ్రశ్రేణిలో ఉన్న ఆసీస్ ను ఈ మ్యాచ్‌లో చితక్కొట్టారని, రోహిత్ శర్మ రూత్‌లెస్‌గా వ్యవహరించి సెంచరీ బాదడని ప్రశంసలు చేశాడు.

ఆసీస్ ఆటగాళ్లను భారత్ ఆడుకుందని, విధ్వంసకరమైన ఆటతీరుతో బెంబేలెత్తించిందని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ అయితే నిర్దయగా వ్యవహరించాడని, ఎలాంటి బంతినైనా స్టాండ్స్‌లోకి పంపడమే ధ్యేయంగా ఆడాడని కితాబిచ్చాడు. అతని షాట్లను చూస్తుంటే తనకు సచిన్ గుర్తుకు వచ్చాడని కొనియాడాడు.

తొలుత జంపాపై పంజా వేసిన హిట్‌మ్యాన్.. స్టార్క్ వరకు అందరినీ తుత్తునీయలు చేశాడని తెలిపాడు. రోహిత్ శర్మ ఆట చూస్తుంటే నాకు సచిన్ ఆటనే గుర్తుకు వస్తుందని అన్నారు. మూడో వన్డేలో గెలుపొందటంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది.

Loading...