రోహిత్ శర్మని ఔట్ చేయడం నా కల : పాక్ ఫేసర్

981
Pakistan pacer Naseem Shah Says Picking Rohit Sharma’s wicket would be a dream come true
Pakistan pacer Naseem Shah Says Picking Rohit Sharma’s wicket would be a dream come true

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీయడమే తన కలని పాక్ యువ పేసర్ నసీమ్ షా అన్నాడు. 16 ఏళ్ల వయసులో టెస్టుల్లో ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు నసీమ్. ఈ ఏదాది మొదట్లో బంగ్లాదేశ్ పై హ్యాట్రిక్ వికెట్స్ సాధించాడు. ఇక రోహిత్ తో పాటు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ లను వరుస బంతుల్లో ఔట్ చేయడం తన డ్రీమ్ హ్యాట్రిక్ అని తెలిపాడు.

ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ బుక్ లో ఉన్న షాట్లని ఆడుతాడని ప్రశంసించిన నసీమ్.. అతని తన బౌలింగ్ లో ఔట్ చేయడం తన కలని చెప్పాడు. “అన్ని రకల బాల్స్ ని హిట్ చేయగల సత్తా రోహిత్ కు ఉంది. ఈ విషయాన్ని అతను సృష్టించిన రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అలాంటి గ్రేట్ బ్యాట్స్ మెన్ వికెట్ తీస్తే నా కల నేరవేరుతుంది. ఇక నిలకడకు మారుపేరైనా స్టీవ్ స్మిత్ వికెట్ తీయడం తనకు సంతోషాన్నిస్తుంది. గతంలో స్మిత్ బౌలింగ్ చేసే అవకాశం దక్కింది.

స్మిత్ వికెట్ తీస్తే మంచి అనుభవం దక్కుతుంది” అని నసీమ్ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్, స్మిత్ వికెట్ తీయాలని నసీమ్ అనుకుంటున్నా ఇప్పట్లో భారత్-పాక్, ఆస్ట్రేలియా-పాక్ టెస్ట్ సిరీస్‌ల్లేవు. కానీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అతను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే మూడు టెస్ట్‌ల సిరీస్‌లో జో రూట్‌ను ఔట్ చేసే ఛాన్స్ ఉంది. పాక్ తరుపున నాలుగు టెస్టులు ఆడిగిన నసీమ్.. 13 వికెట్లు తీసాడు.

లీడర్ అంటే ధోనీనే.. అందుకు అసలైన సాక్ష్యం ఇదే : మాజీ కోచ్ గ్యారీ…

గంగూలీ, ధోనీ కెప్టెన్సీలో తేడా చెప్పిన గ్రేమ్ స్మిత్..!

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ జడేజా.. చివర్లో కోహ్లీ..!

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

Loading...