Thursday, April 25, 2024
- Advertisement -

భారతీయ యువతిని పెళ్లాడిన పాకిస్థానీ క్రికెటర్

- Advertisement -

పాకిస్థాన్ ఫాస్ట్ బౌల‌ర్ హ‌స‌న్ అలీ.. భార‌త్‌కు చెందిన ఏరోనాటిక‌ల్ ఇంజినీర్ సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్ లోని అట్లాంటిస్ హోట‌ల్‌లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు సుమారు 30 మంది వరకు కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.ముస్లిం సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి జ‌రిగింది.

ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఫ్లైట్‌ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి ప‌రిచ‌య‌మైంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి…పెళ్లికి దారి తీసింది. పెళ్లి దుస్తుల్లో ఇద్ద‌రూ చాలా అందంగా ఉన్నారు. బ్లాక్ షేర్వానీలో హ‌స‌న్‌ అలీ, రెడ్ అండ్ గోల్డ్ డ్రెస్సులో ఆర్జూ ఆక‌ట్టుకున్నారు. వీరి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను బుర్జ్ ఖ‌లీఫా ముందు జ‌రిపారు. వ‌లీమా కూడా దుబాయ్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు.

https://www.instagram.com/p/B1ZkkKCg6AV/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -