రిషబ్ పంత్‌ రాణించాలంటే కోహ్లీ ఇలా చేయాలి : పఠాన్

672
Pant Got Too Much Backing From Virat Kohli Says Irfan Pathan
Pant Got Too Much Backing From Virat Kohli Says Irfan Pathan

ఇప్పుడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కి ఒక కిక్ అవసరమని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్పాన్ పఠాన్ అన్నారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు ధోనీ దూరం అవ్వగా.. అతని స్థానంలోకి రిషబ్ పంత్ వచ్చాడు. కానీ అతను ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. దాంతో ఈ ఏడాది మొదట్లో పంత్ కు బదులుగా కేఎల్ రాహుల్‌కి కీపర్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది.

ఎవరూ ఊహించనిరీతిలో అతను రాహుల్ బ్యాట్స్ మెన్ గా కీపర్ గా రాణించాడు. దాంతో.. పంత్‌కి బదులుగా రాహుల్‌కే ఇకపై కీపర్‌గా అవకాశాలివ్వాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. నిజానికి రిషబ్ పంత్‌.. జూనియర్ ధోనీగా పేరు తెచ్చుకున్నాడు. పంత్‌కి కోహ్లీ గత మూడేళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాడు. కానీ ఆ సపోర్ట్ ను పంత్ ఉపయోగించుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీలు బాదిన రిషబ్ పంత్.. వన్డే, టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటీ ప్రదర్శించలేకపోయాడు. దాంతో.. ఇప్పుడు టీమిండియాలో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారిపోగా.. కోహ్లీతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ మరొక ఛాన్స్ అతనికి ఇవ్వాలని పఠాన్ సూచించాడు.

“పంత్ మంచి క్రికెటర్ అని.. మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అని అందరూ కితాబిస్తున్నారు. దాంతో అతనిపై అంచనాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆ అంచనాల్ని అతనిపై పెట్టకుండా అతని స్వేచ్ఛగా రాణించే ఛాన్స్ ఇస్తే.. పంత్ రాణించే ఛాన్స్ ఉంటుంది. కోహ్లీ అతిగా రిషబ్ పంత్‌కి మద్దతు ఇవ్వడంతో అందరి చూపు కూడా పంత్‌పై నిలిచింది. ఇప్పటికీ పంత్‌కి వెనుకవైపు నుంచి కోహ్లీ లేదా మేనేజ్‌మెంట్ ఒక్క కిక్ ఇవ్వగలిగితే.. అతను ఫర్ఫెక్ట్ అవుతాడు” అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

సచిన్‌ సలహా వల్లే ఉత్తమ టెస్టు క్రికెటర్ అయ్యాను : కోహ్లీ

టీమిండియాలోకి ధోనీ మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమట..!

రోహిత్‌ ఈజీగా డబుల్ సెంచరీ చేయడానికి కారణం ఇదే..!

కోహ్లీ భయం అంటే ఏంటో తెలియదట : లాయిడ్

Loading...