Thursday, April 25, 2024
- Advertisement -

ప్రపంచక కప్ ఎఫెక్ట్…పాక్ క్రికెటర్లకు చికెన్ కట్

- Advertisement -

ఇంగ్లండులో జరిగిన ప్రపంచకప్ లో పాక్ వైఫల్యం జట్టుపై పడింది. ప్రధానంగా ఆటగాళ్ల ఫిటెనెస్ పై తీవ్ర ఆరోపనలు వచ్చాయి. పాక్ పెప్టెన్ ఫిట్ నెస్ పైనె విమర్శలు వెల్లువెత్తాయి.భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల మధ్య విరాట్ కోహ్లీ గంటకి 25కి.మీ వేగంతో పరుగెత్తుతుంటే..? వికెట్ల వెనుక పాక్ కీపర్/ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆవలింతలు తీస్తూ కనిపించాడు.

దీనిపై అప్పట్లో పాక్‌ కెప్టెన్‌ని అభిమానులు, మాజీ క్రికెటర్లు పేలవ ఫిట్‌నెస్ ఉన్న కెప్టెన్‌ని తాను ఇప్పటి వరకూ చూడలేదంటూ చురకలేశాడు.వరల్డ్‌కప్‌ ఓటముల నేపథ్యంలో.. ఇటీవల చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్, చీఫ్ సెలక్టర్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌లను పక్కకి తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వారి స్థానంలో మిస్బాను తీసుకుంది.

వెంటనే రంగంలోకి దిగిన మిస్బా ఆటగాళ్ల ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు.ఈ మేరకు ఆటగాళ్ల డైట్‌‌లో అనూహ్య మార్పులు చేసిన మిస్బావుల్.. బిర్యానీ, వేయించిన మాంసం, తీపి పదార్థాలకి దూరంగా ఉండాలని ఆదేశించారు. రంజీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయాల్లో ఆటగాళ్లు ఎవరైనా డైట్ నిబంధనల్ని అతిక్రమించినట్లు తేలితే..? వారిపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని మిస్బావుల్ సీరియస్‌గా హెచ్చరించినట్లు పాక్ బోర్డు అధికారి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -