సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు….ఐదు ఎకరాల స్థలం కేటాయింపు

345
PV Sindhu Meets Andhra Pradesh CM YS Jagan Mohan reddy
PV Sindhu Meets Andhra Pradesh CM YS Jagan Mohan reddy

బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ తెలుగు తేజం పీవీ సింధు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు… ముఖ్యమంత్రిని కలిసింది.బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.సమావేశానంతరం పీవీ సింధు మాట్లాడుతూ, వైజాగ్ లో అకాడమీ నొలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపింది. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది

Loading...