Wednesday, April 24, 2024
- Advertisement -

ధోనీ ఎవరూ హిట్టింగ్ చేయడం నేను చూడలేదు : అశ్విన్

- Advertisement -

ధోనీ హిట్టింగ్ దెబ్బకి ముత్తయ్ మురళీధరన్ విసిరిన ఓ ఆరు బంతులు చెన్నైలోని చెపాక్ స్టేడియం పైకప్పుని తాకాయని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌ గురించి అశ్విన్ తాజాగా మాట్లాడాడు. అప్పట్లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ కి ధోనీ బ్యాటింగ్ అంటే ఏంటో చూపించాడని చెప్పాడు. ధోనీ సిక్స్ కొట్టిన ప్రతిసారి మురళీధరన్ బాల్ లెంగ్త్‌ని మార్చాడని చెప్పాడు.

‘‘చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలింగ్ చేసేందుకు చిన్నపాటి క్యూలో బౌలర్లు నిల్చొని ఉన్నారు. మ్యాచ్‌కి వినియోగించే పిచ్ పక్కనే ఆ నెట్ సెషన్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసింది. సెంటర్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి మురళీధరన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కానీ.. ప్రతి బంతికీ ధోనీ భారీ షాట్ ఆడేస్తూ.. స్టాండ్స్‌లోకి తరలించడాన్ని నేను చూశా. ఆరోజే ఓ ఆరు బంతులు స్టేడియం పైకప్పుని తాకినట్లు గుర్తు. ఇప్పుడంటే ధోనీ కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ.. అప్పట్లో ధోనీలా ఎవరూ హిట్టింగ్ చేయడాన్ని నేను చూడలేదు’’ అని అశ్విన్ వెల్లడించాడు.

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ముత్తయ్ మురళీధరన్ బౌలింగ్ చేస్తుండటంతోనే యువరాజ్ సింగ్‌కి బదులుగా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడు. ఆ మార్పే విజయంకు కారణం అయిందని చాలా మంది క్రికెటర్లు అంటూ ఉంటారు. ఐపీఎల్‌ ప్రాక్టీస్ సెషన్‌లో మురళీధరన్‌ బౌలింగ్‌ని ఎదుర్కొన్న అనుభవం వలనే అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌‌లో ముందుకు వెళ్లినట్లు ధోనీ కూడా స్వయంగా వెల్లడించాడు.

ఆర్డర్ నెం.3లో ధోనీ కంటే విరాట్ కోహ్లీనే మెరుగు : ఇర్ఫాన్ పఠాన్

ఆ విషయంలో రోహిత్ కంటే కోహ్లీనే బేటర్ : గంభీర్

సుశాంత్ మృతిపై ధోనీ స్పందించకపోవడానికి కారణం ఏంటి ?

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏం సాధించాడు ?: గంభీర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -