సచిన్ కోసం స్కూల్ డుమ్మా.. : రైనాకు షాక్ ఇచ్చిన భజ్జీ..!

638
Raina About Bunking School To Watch Tendulkar’s Desert Storm Match
Raina About Bunking School To Watch Tendulkar’s Desert Storm Match

భారత వెటరన్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. 1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూడటం కోసం అప్పట్లో స్కూల్ డుమ్మా కొట్టినట్లు ఇటివలే ఓ ఇంటర్యూలో సురేశ్ రైనా చెప్పాడు.

దాంతో అదే సిరీస్ లో సచిన్ తో కలిసి ఆడిన హర్భజన్ సింగ్ షాక్ అయ్యి.. ఆ మ్యాచ్ లు జరిగింది సాయం కాలం.. మరి స్కూల్ డుమ్మా ఎలా కొట్టావ్ ? అని ట్విట్టర్ లో ప్రశ్న సంధించాడు. దాంతో రైనా జవాబు ఇవ్వాలేదు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ భిభత్సంగా ఆడాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేసిన సచిన్.. కంగారూల బౌలర్లని ఉతికారేశాడు. సచిన్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ షార్జా ఇన్నింగ్స్ ఓ మచ్చుతునక.

ఇక రైనా ఏం చెప్పాడంటే..”మా ఇంట్లో టీవీ ఉండేది. అయితే అందులో కేవలం దూరదర్శన్ మాత్రమే వచ్చేది. దాంతో ఆ సిరీస్ ని చూడటం కోసం నేను చివరి రెండు పీరియడ్స్‌ని బంక్ కొట్టేవాడ్ని. అప్పట్లో సచిన్ ఓపెనర్‌గా ఆడేవాడు. నేను కేవలం సచిన్ లేదా రాహుల్ డ్రవిడ్ బ్యాటింగ్ మాత్రమే చూసేవాడ్ని. ఒకవేళ సచిన్ ఔటైతే.. టీవీ ముందు నుంచి వెళ్లిపోయేవాడ్ని. అప్పుడు నాకు 12 ఏళ్లు ఉంటాయి’’ అని రైనా వెల్లడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ లో హిట్టర్‌ని సిద్దం చేస్తున్న ధోనీ..!

ధోనీ రిటైర్మెంట్ గురించి రైనా ఏమన్నాడంటే ?

తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి ఎప్పుడు అయింది ?

ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పి చెన్నైకి షాక్ ఇచ్చిన శ్రీశాంత్

Loading...