గంభీర్, కోహ్లీ గొడవ గురించి చెప్పిన రజత్ భాటియా

514
Rajat Bhatia Opens Up On Ugly Spat Between Virat Kohli And Gautam Gambhir
Rajat Bhatia Opens Up On Ugly Spat Between Virat Kohli And Gautam Gambhir

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవ పడిన విషయమ్ తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగగా.. అవుట్ అయ్యి వెళ్తున్న విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ కవ్వింపులకి దిగాడు.

దాంతో కోహ్లీ.. గంభీర్ తో వాగ్వాదానికి దిగగా.. ఇద్దరు కొట్టుకునేలా కనిపించారు. అయితే.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్ రజత్ భాటియా మధ్యలోకి వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్‌లో ఆ గొడవపై తాజాగా రజత్ భాటియా మాట్లాడుతూ ‘‘విరాట్, గౌతమ్.. ఇద్దరు మంచి కెఫ్టెన్లు. అయితే ఆ మ్యాచ్ లో వారి ఇద్దరి మధ్య గొడవని మ్యాచ్‌లో భాగంగానే చూడాలి. కానీ.. వారు దూషించుకున్న తీరు మాత్రం చాలా చెత్తగా ఉంది.

అయితే.. ఆ గొడవ తర్వాత ఎప్పుడూ వారు మైదానంలో అలా పోట్లాడుకోవడాన్ని నేను చూడలేదు’’ అని వెల్లడించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ రెండు సార్లు టైటిల్స్ అందించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఒక్కసారి కూడా కోహ్లీ విజేతగా నిలపలేకపోయాడు.

కీపింగ్ లో రాహుల్ కంటే పంత్ సెప్షలిస్టూ : ఆకాశ్ చోప్రా

రోహిత్‌కి జోడీగా రాహులే బేటర్.. ధావన్ వద్దు : ఆకాశ్ చోప్రా

చాలాసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. : మహ్మద్ షమీ

ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ వన్ ఫీల్డర్ జడేజానే : గంభీర్

Loading...