Friday, April 19, 2024
- Advertisement -

జడేజా బెస్ట్ ఫీల్డర్ అని చెప్పే సాక్ష్యం ఇది..!

- Advertisement -

ప్రస్తుతం భారత జట్టులో బెస్ట్ ఫీల్డర్ ఎవరు అనే ప్రశ్నకు ఫ్యాన్స్ నుంచో చాలా అన్సర్స్ వస్తాయి. అయితే గ్రౌండ్ లోని పాయింట్ పొజిషన్ లో ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో ? అతను ఆ టీంలోనే బెస్ట్ ఫీల్డర్ గా చెప్పుకోవచ్చు. అయితే యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా గతంలో ఆ పాయింట్ రీజిన్‌లో ఫీల్డింగ్ చేసేవారు.

ఇప్పుడు ఆ స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేస్తున్నాడు. కను రెప్ప మూసి తెరిచేలోగా బత్తిని అందుకునే దమ్ము.. వికెట్లపైకి నేరుగా బంతిని విసిరే సామర్థ్యం ఉన్న వారిని మాత్రమే అక్కడ ఫీల్డింగ్ కు పెడుతారు. పాయింట్ దిశగా ఫీల్డింగ్ చేస్తూ రవీంద్ర జడేజా ఇప్పటికే ఎన్నోసార్లు తన మెరుపు రనౌట్స్‌ చేసి ప్రతి ఒక్కర్ని షాక్ కు గురి చేశాడు. 2018-19లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో రవీంద్ర జడేజా చేతికి బంతి వెళ్లినా.. సాహసోపేతంగా ఉస్మాన్ ఖవాజా పరుగు కోసం వెళ్లాడు.

దాంతో.. బౌలర్ కుల్దీప్ యాదవ్ పక్క నుంచి బంతి విసిరిన జడేజా.. ఖవాజాని రనౌట్ చేసిన తీరుకి అప్పట్లో ఆస్ట్రేలియా టీమ్ నోరెళ్లబెట్టింది. ఫస్ట్, సెకండ్ పవర్‌ ప్లేలో పాయింట్ వద్ద.. స్లాగ్ ఓవర్లలో బౌండరీ లైన్స్ వద్ద జడేజా బెస్ట్ ఫీల్డింగ్ చేస్తుంటాడు. రన్నింగ్ క్యాచ్ లను అతని మిస్ చేయడం అనేది చాలా అరుదు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న జడేజా మాత్రం అతని ఫీల్డింగ్ లో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించడు. అందుకే.. మూడూ ఫార్మాట్లలో జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు.

https://www.instagram.com/p/CBJ3eiWnVqH/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -