Friday, April 19, 2024
- Advertisement -

ఫ్యాక్ట్ చెక్……… ధోని, కోహ్లీ అండ్ టీమ్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే?

- Advertisement -

…22వ ఓవర్లో రాస్ టేలర్ క్యాచ్‌ని ఎందుకు అందుకోలేకపోయాడు? ఒకప్పుడు గిల్‌క్రిస్ట్ ఇలానే వయసు అయిపోయాక ఒక క్యాచ్ అందుకోవడంలో విఫలమైన వెంటనే రిటైర్మెంట్ గురించి ఆలోచించాడు, రిటైర్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ అంతా కూడా ధోనీ ఎన్ని ఎక్కువ బైస్ ఇచ్చాడో తెలుసా? ఈవెన్ సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా ఛాహల్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ మిస్ అయిన బంతిని అందుకోలేకపోయాడు. అలాంటి మిస్‌లు ఎన్నో. ఇక ఇదే వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లో అదర్ ఎండ్‌లో ధోనీ స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఉంటూ రన్ రేట్ పెరుగుతూ ఉంటేనో, రన్స్ పెంచాల్సిన పరిస్థితిల్లోనో రిస్కీ షాట్స్ ఆడిన బ్యాట్స్‌మెన్ ఎంతమందో తెలుసా? కోహ్లితో సహా అందరికీ అలాంటి ప్రెషర్ ఇచ్చాడు ధోనీ. సెమీఫైనల్ అయితే రవీంద్రజడేజాలాంటి బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ అనిపించుకున్న ప్లేయర్ కూడా సాహసోపేతంగా ఆడుతూ ఉంటే ది బెస్ట్ ఫినిషర్ అన్న ట్యాగ్ ఉన్న ధోనీ మాత్రం కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. సింగిల్స్ కొట్టాల్సిన స్టేజ్‌లో అసలు రన్స్ చేయకుండా ఫోర్స్, సిక్స్‌లు కొట్టాల్సిన స్టేజ్‌లో సింగిల్స్ తీసి అన్‌బిలీవబుల్ అనే స్థాయిలో ఆడిన జడేజాకు కూడా సాధ్యం కానంత రన్‌రేట్ పెరిగేలా చేశాడు. రనౌట్ కాకుండా ఉంటే గెలిపించేవాడు అనడంలో అర్థమే లేదు. ఔట్ కాకుండా ఉంటే భువనేశ్వర్ కూడా గెలిపిస్తాడు. ఆడినంత సేపు ఏం చేశాడనేదే గేం.

………ఇక ది బెస్ట్ ప్లేయర్, టీం కోసం ఎంతో చేశాడు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతకంటే గొప్పగా ఉండేలా ట్రీట్ చేయండి. అంతే కానీ అప్పుడెప్పుడో వరల్డ్ కప్ గెలిపించాడు, చాలా మ్యాచ్‌లు గెలిపించాడని ఇప్పుడు కొన్ని మ్యాచ్‌లు ఓడగొట్టినా క్షమించేద్దాం. అండగా నిలబడదాం అంటే అంత కరెక్ట్ కాదేమో.

…………బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా అంత ఎఫెక్టివ్‌గా లేడు అంటే కెప్టెన్‌కి సలహాలు ఇస్తూ ఉన్నాడు. అందుకైనా టీంలో ఉండాలి అంటారు. మరి ఇదే కెప్టెన్ కోహ్లీ షార్ట్ ఫామ్స్ కంటే కూడా టెస్టుల్లో ఇంకా గొప్పగా సక్సెస్ అయ్యాడు కెప్టెన్సీ విషయంలో. మరి అక్కడ ధోనీ లేడుగా. షార్ట్ ఫామ్స్ కంటే కూడా టెస్టుల్లోనే కెప్టెన్సీ సామర్థ్యం ఎక్కువ బయటపడుతుంది అన్న విషయం నిజం. అన్నింటికీ మించి ఇన్నేళ్ళ తర్వాత కూడా కెప్టెన్సీ విషయంలో నాకు ధోనీ సలహాలు కావాలి. అందుకైనా ధోనీ టీంలో ఉండాలి అని కోహ్లీ అంటే ముందు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి సొంతంగా జట్టును నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాలి.

కొంచెం హార్ష్‌గా ఉండొచ్చు. కానీ ఆదాయం తక్కువ ఉండే టెస్ట్ ఫార్మాట్ నుంచి ఇంకా ఆడే వయసు ఉండగానే రిటైర్ అయిన ధోనీ భారీగా ఆదాయం ఉండే షార్ట్ ఫార్మాట్స్‌లో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా, ఆడలేకపోతున్నాను, అలసిపోయాను అని తనకే అర్థమవుతూ ఉన్నా ఎందుకు డెసిషన్ తీసుకోవడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -