Friday, March 29, 2024
- Advertisement -

ర‌విశాస్త్రి త‌రువాత టీమిండియా హెడ్ కోచ్ ఎవ‌రంటె…?

- Advertisement -

ప్ర‌స్తుత టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం ఈ ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగియ‌నుంది. త‌రువాత టీమిండియాకు కోచ్ ఎవ‌ర‌నే దానిపై అస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గుతోంది.తాజ‌గా గంగూలి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిరేపుతున్నాయి. రెండేళ్ల క్రితం కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకంపై గంగూలీ, రవిశాస్త్రి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎవరు ఉండాలి..? అనే నిర్ణయాన్ని 2015 నుంచి గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ అప్పగిస్తూ వస్తోంది. ఈ క‌మిటీనె ఒక సారి కుంబ్లే…త‌రువాత ర‌విశాస్త్రిని కోచ్‌గా నియ‌మించింది. గంగూలి వ్యాఖ్య‌లు చూస్తె త‌రువాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అనే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అదే టీమ్‌కి సలహాదారుడిగా పనిచేస్తున్నారు గంగూలీ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతుండగా.. ‘పాంటింగ్ భవిష్యత్‌లో టీమిండియాకి హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దాదా.. పరోక్షంగా అవుననే సంకేతాలిచ్చాడు. రికీ పాంటింగ్‌‌నే ఈ ప్రశ్న మీరు అడగాలి. ఎందుకంటే.. అతను ఏడాదిలో 8 నుంచి 9 నెలలు ఇంటికి దూరంగా ఉండగలడా..? ఒకవేళ అతను ఉండగలను అంటే మాత్రం.. నిస్సందేహంగా టీమిండియా‌కి గొప్ప కోచ్ అవుతాడంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -