కోచ్ రవిశాస్త్రిపై విరుచుకు పడిన మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్…

275
Robin Singh Fire on India coach ravisastri
Robin Singh Fire on India coach ravisastri

కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ ఫైర్ అయ్యారు. రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో భారత్‌ ఏ ఒక్క ఐసీసీ మేజర్‌ టోర్నమెంట్లను గెలవలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.దాంతో కోచ్‌ మార్పు అనేది టీమిండియాకు ఎంతో అవసరమనే విషయాన్ని రాబిన్‌ సింగ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

టీ20 ఛాంపియన్ షిప్ లో కూడా పరాభవమే ఎదురైందని మండిపడ్డారు. 2023 ప్రపంచకప్ పై ఇక నుంచి మనం దృష్టి సారించాల్సి ఉందని… ఈ క్రమంలో కొన్ని మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. మరోవైపు హెడ్ కోచ్ పోస్ట్ కోసం రాబిన్ సింగ్ కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. హోడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో థెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజన్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

2015, 2019 వరల్డ్‌కప్‌ల్లో భారత్‌ సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఇక 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కూడా భారత్‌ సెమీస్‌ అడ్డంకిని అధిగమించలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పట్నుంచే సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాబిన్‌ సింగ్‌.. 2007-09 సీజన్‌లో భారత్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేశాడు. మరొకవైపు అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు సైతం ఫీల్డింగ్‌ కోచ్‌గా చేసిన అనుభవం రాబిన్‌కు ఉంది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

Loading...