Thursday, April 25, 2024
- Advertisement -

సచిన్ కంటే రోహీత్ శర్మ అత్యుత్తమ ఓపెనర్ : మాజీ క్రికెటర్

- Advertisement -

వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే రోహిత్ శర్మ అత్యుత్తమ ఓపెనర్ అని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ అన్నారు. వన్డేల్లో సచిన్ కంటే సగటు, స్ట్రైక్‌రేట్‌లోనూ రోహిత్ మెరుగ్గా ఉన్నాడని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. సచిన్ సెంచరీ ముందు ఒత్తిడికి గురి అవుతాడని.. కానీ రోహిత్ అలా ఒత్తిడికి గురి కాడని.. తనదైన శైలిలో సెంచరీ చేస్తాడని అన్నారు. సైమన్ డౌల్ గతంలో రోహిత్ శర్మను తన ఉత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌ అని కితాబిచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఐసీసీ క్రికెట్ ఇన్సైడ్ అవుట్‌లో సైమన్ డౌల్ మాట్లాడుతూ… “మ్యాచ్ పరిస్థితి బట్టి రోహిత్ శర్మ ఆడుతాడని.. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాడంటే భారీ స్కోర్ చేస్తాడని.. చాలా ఈజీగా ఆఫ్ సెంచరీ చేగలడు. అలానే 90 స్కోర్ల వద్ద కూడా రోహిత్ ఒత్తిడికి లోనవ్వడం తాను చూడలేదని అన్నాడు. వన్డేల్లో సచిన్‌తో పోలిస్తే.. సగటు, స్ట్రైక్‌రేట్‌లోనూ రోహిత్ మెరుగ్గా ఉన్నాడు. సచిన్‌ కంటే రోహిత్ అత్యుత్తమ ఓపెనర్” అని అన్నాడు.

గతంలోనే రోహిత్ శర్మ నెం .1 అని చెప్పాను. రోహిత్ ఆల్‌టైమ్ ఇండియన్ జట్టులో ఎంపికైన మొదటి ఓపెనర్. నన్ను క్షమించండి.. కానీ మీరు గణాంకాలను చూస్తే సచిన్‌ కంటే రోహితే అత్యుత్తమ ఓపెనర్. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా వస్తాడు. అయితే ఎంఎస్ ధోనీ ఆర్డర్‌ను మరింత తగ్గించినపుడు అతన్ని లెక్కలోకి తీసుకోవచ్చు అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు

సుదీర్ఘ కెరీర్‌లో 463 వన్డేలాడిన సచిన్ .. 44.83 సగటుతో 18,426 పరుగులు చేసాడు. స్ట్రైక్‌రేట్ 86.24గా ఉంది. రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 224 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 49.27 సగటుతో 9115 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 88.93గా ఉంది. వన్డేల్లో సచిన్ ఒక డబుల్ సెంచరీ చేయగా.. రోహిత్ మూడు ద్విశతకాలు చేసాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -