Wednesday, April 24, 2024
- Advertisement -

మరో సరికొత్త రికార్డు సాధించిన రోహిత్ శర్మ

- Advertisement -

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్‌గా ఈ రికార్డు సాధించాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ ఓపెనర్‌గా 6,987 వన్డే పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 13 పరుగులు చేసి రోహిత్ శర్మ తన 137వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీం ఆమ్లా(147 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్(160), తిలకరత్నే దిల్షాన్(165), సౌరవ్ గంగూలీ(168) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో 7000 పరుగులు సాధించిన 11వ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు.

ఇక భారత్ తరుపున 7000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో ఓపెనర్‌గా నిలిచాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్(15,310), సౌరవ్ గంగూలీ(9,146), వీరేంద్ర సెహ్వాగ్(7,518)లు ఈ ఘనత సాధించారు. రెండో వన్డేలో జట్టు స్కోరు 81 పరుగుల దగ్గర రోహిత్ శర్మ(42) ఔటయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -