స్టేడియంలో రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకు ?

1959
Rohit Sharma gets angry over error on giant screen
Rohit Sharma gets angry over error on giant screen

బంగ్లాదేశ్ తో రాజ్ కోట్ లో రెండో టి20 జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓ సందర్బంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ విపరీతమైన కోపం చూపించాడు. చాహల్ బౌలింగ్ లో బంగ్లా బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ ను పంత్ స్టంపౌట్ చేశాడు. దీనిపై థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఫస్ట్ నాటౌట్ అని చెప్పాడు. అయితే స్టేడియంలో ఉన్న స్క్రీన్ పై నౌటౌట్ అని చూపించడంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

థర్డ్ అంపైర్ అనిల్ చౌదరిపై మండిపడ్డాడు. ఆ తర్వాత అది ఔట్ అని స్క్రీన్ పై డిస్ ప్లే కావడంతో రోహిత్ శర్మ ఆగ్రహం తగ్గింది. అయితే రోహిత్ శర్మ కోపం స్క్రీన్ పై కనిపించడమే కాదు.. అతను తిట్టిన తిట్లపురాణం కూడా అక్కడ స్టంప్ మైక్ ద్వారా వినిపించాయి. ఈ విషయంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తానెప్పుడూ ఆటలో ఉన్నప్పుడు భావోద్వేగాలతో ఆడుతానని.. మ్యాచ్ ఎలాగైన గెలవాలన్న టైంలో భావోద్వేగాలకు లోనవడం మాములే అని తెలిపాడు.

అయితే ఈ సారి కోపం వచ్చినప్పుడు కెమెరా ఎక్కడ ఉందో చూసుకుని జాగ్రత్త పడుతానని చమత్కరించాడు. మొదటి మ్యాచ్ లో ఓటిమి కారణంగా రెండో మ్యాచ్ ను తెలిగ్గా తీసుకోలేకపోయామని, అందుకే కొంత తీవ్రత తనలో కనిపించి ఉండొచ్చని తెలిపాడు. ఈ సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉంది. నాగ్ పూర్ వేదికగా రేపు మూడో టి20 జరగనుంది.

Loading...