Friday, March 29, 2024
- Advertisement -

తొలిసారి త‌న‌ కూతురి ఫోటోను షేర్ చేసిన రోహిత్ శ‌ర్మ‌…

- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ తండ్రి అయిన విషయం తెలిసిందే. 2018, డిసెంబర్ 30వ తేదీన అతని సతీమణి రితికా ముంబైలోని ఓ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ వెంటనే భారత్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గురువారం రోహిత్ తన కూతురి తొలి చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన వేలిని, తన భార్య రితికా వేలిని పట్టుకున్న చిన్నారి ఫోటోని సోషల్‌మీడియా ద్వారా పంచుకన్నాడు. ‘‘హలో వరల్డ్.. 2019 అందిరికి చాలా అద్భుతంగా గడవాలి’’ అంటూ ఆ ఫొటోకి రోహిత్ క్యాప్షన్ పెట్టాడు.

రితికా ప‌డ్డంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని రితికా బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. ‘రోహిత్ దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది’ అంటూ సీమా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.జనవరి 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో రోహిత్ పాలుపంచుకోనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -