Thursday, March 28, 2024
- Advertisement -

మైదానంలో ఇక నుంచి ధోని స్థానంలో రోహిత్….

- Advertisement -

టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ అయినా మైదానంలో మాత్రం సూచనలు, సలహాలు వెలకట్టలేనివి. కెప్టెన్ కాకపోయినా సగం బాధ్యతలు నిర్వహిస్తాడు ధోని. మైదానంలో ధోని తీసుకున్న నిర్ణయాల వల్ల టీమిండియా అనేక సార్లు విజయం సాధించింది. కోహ్లీ ధోని సలహాను తీసుకోనిదే డీఆర్ ఎస్ కు వెల్లడు. అది గతం. కాని ఇప్పుడు ధోని క్రికెట్ కు దూరంగా ఉన్నారు.

ధోని లేని లోటు భర్తీ చేసేందుకు రోహిత్ రంగంలోకి దిగారు. ధోనీ గత రెండేళ్లుగా మైదానంలో నిర్వహించిన సలహాలు, సూచనల బాధ్యతల్ని ఇకపై రోహిత్ శర్మ నిర్వర్తించనున్నాడు.కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌలర్లకి సలహాలు ఇవ్వడంతో పాటు ఫీల్డింగ్ మార్పు వ్యవహారాల్ని ధోనీ చూసుకునేవాడు.తాజాగా టీమిండియా‌కి దూరంగా ధోనీ ఉండిపోతుండటంతో ఆ బాధ్యతల్ని సీనియర్ ఆటగాడు, వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకి అప్పగించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా నాలుగు టైటిల్స్ అందించాడు రోహిత్. నిదహాస్ ట్రోఫీని కూడా భారత్ కి అందించాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతడి అనుభవాన్ని వినియోగించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.టీ20, వన్డే సిరీస్‌లోనైనా విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టేవారు.మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20లో అనధికార కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పు వ్యవహారాలు చూసిన రోహిత్ శర్మ.. ఒకానొక దశలో హార్దిక్ పాండ్యాకి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రోహిత్ అనుభవాన్ని ఉపయేగించుకోవాలని కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు నిర్నయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -