Thursday, April 25, 2024
- Advertisement -

రోహిత్ శర్మకు ఏమైంది.. ఎందుకు ఇలా ఆడుతున్నాడు ?

- Advertisement -

భారత జట్టు ఓపెనర్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్కకు 2019 సంవత్సరం ఓ వరం. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సంచరీలు తర్వాత టెస్టుల్లో ఓపెనర్ గా సెంచరీల మీద సెంచరీలు చేశాడు. ఈ ఏడాది మొత్తంగా మూడు ఫార్మాట్లలో రెండు వేలకు పైగానే పరుగులు చేశాడు.

ఈ ఏదాది మూడు ఫార్మట్లలో ఎక్కువ పరుగులు చేసిన జాబితాల్లో విరాట్ కోహ్లీ (2296) అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (2113) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ యావరేజీ 50కి పైగా ఉండటం విశేషం. అయితే టీ20ల్లో మాత్రం రోహిత్ శర్మ రికార్డు ఏమంత మెరుగ్గా లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే 13 టీ20లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 325 పరుగులు మాత్రమే చేశాడు.

గత ఆరేళ్లలో రోహిత్ శర్మ ఇంత తక్కువ యావరేజిని కలిగి ఉండటం ఇదే తొలిసారి. పదమూడు మ్యాచ్‍ల్లో కేవలం ముడు మ్యాచ్‍ల్లోనే 50కిపైగా పరుగులు చేశాడు రోహిత్. అలానే ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్ తో ఔటయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -